Home న్యూస్ విజిల్ Vs ఖైదీ డే 1 కలెక్షన్స్…షాకింగ్!!

విజిల్ Vs ఖైదీ డే 1 కలెక్షన్స్…షాకింగ్!!

0

     దీపావళి బరిలో తెలుగు సినిమాలు పోటి లో లేని సమయం లో తమిళ్ నుండి డబ్ అయిన 2 క్రేజీ మూవీస్ విజిల్ మరియు ఖైదీ లు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అద్బుతమైన ఆరంభాన్ని సొంతం చేసుకున్నాయి అని చెప్పొచ్చు. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు విజిల్ సినిమా 40 టు 45% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి ఏకంగా 65% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అయింది.

ఇక కార్తీ నటించిన ఖైదీ ఉదయం 20% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి 40% వరకు ఆక్యుపెన్సీ తో రన్ అవుతూ దూసుకు పోతుంది, మౌత్ టాక్ బాగుండటం తో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో కూడా ఈ రెండు సినిమాలు దుమ్ము లేపుతున్నాయి.

దాంతో ఇప్పుడు ఫస్ట్ డే విజిల్ సినిమా తెలుగు రాష్ట్రాలలో 2.5 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు, ఇక ఖైదీ సినిమా ఫస్ట్ డే 1.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద రెండు సినిమాలు కలిపి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకోబోతున్నాయి.

ఇక వరల్డ్ వైడ్ గా బిగిల్ 65 కోట్ల నుండి ఇప్పుడు 70 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవచ్చని అంటున్నారు, తమిళ్ లోనే సినిమా 25 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోబోతుందట. ఇక ఓవర్సీస్ లో 30 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని అందుకోవచ్చని సమాచారం. ఇక ఖైదీ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా…

12 కోట్ల నుండి 15 కోట్ల మధ్యలో గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఇది మంచి ఆరంభం అని చెప్పొచ్చు. మొత్తం మీద మొదటి రోజు రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here