Home న్యూస్ విజిల్ Vs ఖైదీ…ఫస్ట్ డే ఓపెనింగ్స్ రిపోర్ట్!!

విజిల్ Vs ఖైదీ…ఫస్ట్ డే ఓపెనింగ్స్ రిపోర్ట్!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ 2 క్రేజీ తమిళ్ హీరోలు నటించిన డబ్బింగ్ మూవీస్ తెలుగు లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి, వాటిలో విజయ్ నటించిన విజిల్ మంచి క్రేజ్ ని సొంతం చేసు కోగా, కార్తీ నటించిన ఖైదీ ఇప్పుడు మౌత్ టాక్ తో దుమ్ము లేపడానికి సిద్ధం అవు తుంది, ఇక రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసు కుందాం పదండీ..

విజిల్ మరియు ఖైదీ సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా క్రేజ్ ఎక్కువగా ఉన్న విజిల్ సినిమా రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 40 టు 45% వరకు ఆక్యుపెన్సీ తో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది. ఇక ఖైదీ సినిమా ఎక్స్ పెరి మెంటల్ మూవీ అవ్వడం తో….

ఓపెనింగ్స్ పరంగా సినిమా 20% పైగా ఆక్యుపెన్సీ తో ఓపెన్ అవ్వగా మౌత్ టాక్ బాగుండటం తో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మంచి గ్రోత్ సాధించే అవకాశం ఉంది, ఇక విజిల్ కూడా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ చూపెట్టే అవకాశాలు గట్టిగా ఉండటం తో రెండు సినిమాలు సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి చూస్తె విజిల్ అవలీలగా 2.3 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సాధించవచ్చు, ఇది విజయ్ కెరీర్ లోనే రికార్డ్ తెలుగు రాష్ట్రాలలో, ఇక ఖైదీ తెలుగు లో కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉంది, ఇక నైట్ షోల సమయానికి రెండు సినిమాలు జోరు అందుకుంటే…

విజిల్ 2.5 కోట్ల రేంజ్ లో ఖైదీ 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా బిగిల్ 60 కోట్ల నుండి 65 కోట్ల రేంజ్ లో ఖైదీ 10 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉందని సమాచారం. ఇక రోజు ముగిసే సరికి ఈ సినిమాల స్టేటస్ ఎలా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here