Home న్యూస్ విజిల్ Vs ఖైదీ… డే 3 కలెక్షన్స్…సెన్సేషనల్!!

విజిల్ Vs ఖైదీ… డే 3 కలెక్షన్స్…సెన్సేషనల్!!

0

     దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన రెండు డబ్బింగ్ మూవీస్ విజిల్ మరియు ఖైదీ రెండు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్నాయి. విజిల్ 2 రోజుల్లో 90 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా ఖైదీ 14 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం. ఇక రెండు సినిమాలకు మూడో రోజు ఆదివారం అవ్వడం తో రెట్టించిన జోరు తో దుమ్ము లేపుతున్నాయి.

ముఖ్యంగా విజిల్ సినిమా మాస్ క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 2 వరోజు కన్నా కొన్ని సెంటర్స్ లో బెటర్ ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది, మరో పక్క ఖైదీ కూడా తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయిన బాగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది.

ఈవినింగ్ అండ్ నైట్ షోలు అద్బుతంగా సాగుతుండగా విజిల్ సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.7 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ షేర్ ని అవలీలగా అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఖైదీ సినిమా మూడో రోజు కూడా మరోసారి 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ షేర్ ని అందుకోవచ్చట.

ఇక వరల్డ్ వైడ్ గా విజిల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ నుండి 30 కోట్ల రేంజ్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవచ్చని అంటున్నారు. దాంతో మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది సినిమా. ఇక ఖైదీ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ రోజు 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సాధించవచ్చని అంటున్నారు.

ఓవరాల్ గా రెండు సినిమాలు మంచి జోరు తో కలెక్షన్స్ ని రాబడుతూ దూసుకు పోతున్నాయి. ఇక సోమవారం కూడా హాలిడే నే అవ్వడం తో సినిమా ఆ రోజు కూడా జోరు చూపడం ఖాయమని చెప్పొచ్చు. దీపావళి వీకెండ్ తెలుగు మూవీస్ కలెక్షన్స్ ఉండవని వదిలేస్తే తమిళ్ డబ్బింగ్ మూవీస్ అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here