Home న్యూస్ సీమలో సింహాద్రి రికార్డ్ బ్రేక్ అవ్వలేదు…ఆ సినిమా కొడుతుందా ??

సీమలో సింహాద్రి రికార్డ్ బ్రేక్ అవ్వలేదు…ఆ సినిమా కొడుతుందా ??

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ నుండి చాలా సినిమాలే రీ రిలీజ్ లను సొంతం చేసుకున్నాయి. రెండేళ్ళ క్రితం మంచి జోరు రీ రిలీజ్ లలో కొనసాగగా రీసెంట్ గా ఈ ట్రెండ్ మరీ ఎక్కువ అవ్వడంతో, జనాలు రీ రిలీజ్ లను పట్టించుకోవడం ఆపేయగా ఇక ట్రెండ్ ఆగిపోయింది అనుకుంటున్న టైంలో రీసెంట్ గా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర…

మురారి మూవీ అలాగే ఇంద్ర సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో జోరు చూపించి తిరిగి రీ రిలీజ్ ల ట్రెండ్ కి ఊపిరి పోయగా త్వరలో మరిన్ని రీ రిలీజ్ లు జరగబోతూ ఉండగా ఓవరాల్ గా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ వస్తూ ఉండగా నైజాంలో కొన్ని సినిమాలు…

అంచనాలను మించి జోరు చూపించగా రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన మూవీస్ లో ఏ సినిమా కూడా 50 లక్షల మార్క్ ని అందుకోలేకపోతుంది అని అనుకుంటున్న టైంలో లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్ డే టైంలో సింహాద్రి సినిమా రీ రిలీజ్ అయ్యి…

అన్ని చోట్లా సంచలన కలెక్షన్స్ ని అందుకోగా సీడెడ్ లో మాత్రం అంచనాలను మించే రేంజ్ లో 76 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని కొత్త రికార్డు ను నమోదు చేసింది రీ రిలీజ్ లలో…ఆ రికార్డ్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉండగా మిగిలిన సినిమాల్లో ఏవి కూడా..

50 లక్షల మార్క్ ని ఇంకా అందుకోలేక పోతూ ఉండగా సింహాద్రి రికార్డ్ కలెక్షన్స్ అలానే కొనసాగుతుంది. ఒకసారి రాయలసీమ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Re Release Movies Ceeded 1st Day Top Collections
👉#Simhadri4K – 76L
👉#Kushi4K – 45L
👉#Jalsa- 39L
👉#Businessman4K – 35L
👉#Murari4K – 32L
👉#Indra4K – 30L~*****

ఇండస్ట్రీ హిట్ ఇంద్ర రీ రిలీజ్ కూడా పెద్దగా అంచనాలను మించలేక పోయింది ఈ ఏరియాలో…ఇలాంటి టైంలో ఇప్పుడు మంచి హైప్ నడుమ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు టైములో గబ్బర్ సింగ్ మూవీ గ్రాండ్ గా రీ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఆ సినిమా సింహాద్రిని టార్గెట్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ సినిమా సింహాద్రి రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here