Home న్యూస్ మురారి ఇండస్ట్రీ రికార్డ్ ను టార్గెట్ చేసిన గబ్బర్ సింగ్….కొడితే భీభత్సమే!!

మురారి ఇండస్ట్రీ రికార్డ్ ను టార్గెట్ చేసిన గబ్బర్ సింగ్….కొడితే భీభత్సమే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం మొదలయిన రీ రిలీజ్ ల ట్రెండ్ మొదట్లో ఫ్యాన్స్ ఎంజాయ్ మెంట్ తో మొదలు అయ్యి తర్వాత ఫ్యాన్స్ మధ్య రికార్డుల విషయంలో మా సినిమా ముందు ఉండాలి అంటే మా సినిమా ముందు ఉండాలి అంటూ రచ్చ జరగడంతో వరుస పెట్టి రీ రిలీజ్ లు ఆడియన్స్ ముందుకు వచ్చి…

కొన్ని అంచనాలను మించి జోరు చూపించగా ఒక స్టేజ్ వరకు బాగున్నా తర్వాత రీ రిలీజ్ ల ట్రెండ్ స్లో డౌన్ అయ్యి రీసెంట్ టైంలో ఆడియన్స్ రీ రిలీజ్ లను పెద్దగా పట్టించుకోవడం ఆపేసిన తర్వాత ఇక ఈ ట్రెండ్ ఆగిపోయింది అనుకుంటున్న టైంలో ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా….

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి(Murari4K Movie) ఊహకందని రేంజ్ లో సక్సెస్ గా నిలిచింది. ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ ను భారే ఎత్తున థియేటర్స్ కి రప్పించి ఇప్పుడు 8 కోట్లు దాటేసి 9 కోట్ల కలెక్షన్స్ మార్క్ వైపు…

పరుగులు పెడుతూ ఉండగా ప్రీవియస్ రికార్డ్ రీ రిలీజ్ మూవీస్ ను క్రాస్ చేసిన మురారి మూవీ కలెక్షన్స్ ని ఇప్పుడు క్రాస్ చేసే అవకాశం త్వరలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అయిన గబ్బర్ సింగ్(Gabbar Sing4K Movie) కి ఎంతైనా ఉంది….

పవన్ కళ్యాణ్ బర్త్ స్పెషల్ గా రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ లెవల్ లో రిలీజ్ కానుండగా రికార్డ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది కానీ…

ఆ టైంకి టాలీవుడ్ నుండి సరిపోదా శనివారం గ్రాండ్ రిలీజ్ ఉండగా వీకెండ్ ఉండటంతో థియేటర్స్ క్లాష్ కచ్చితంగా ఉంటుంది…మురారిలా ఓపెన్ రన్ ఉండదు కాబట్టి ఎంత భారీ రిలీజ్ ఉన్నా కూడా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది…కానీ ఒకవేళ సినిమా ఇవన్నీ తట్టుకుని రికార్డ్ కలెక్షన్స్ తో మురారిని అందుకుంటే కచ్చితంగా అది మాస్ భీభత్సం అని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో త్వరలో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here