Y S R పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకుంది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశనే ఓవరాల్ గా మిగిలించింది, ఓపెనింగ్స్ పరంగా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా లేక పోవడం తో మౌత్ టాక్ పైనే ఆధార పడిన ఈ సినిమా మొదటి షో సమయానికి కేవలం
10 శాతం వరకు మాత్రమె ఆక్యుపెన్సీ ని ఓవరాల్ గా సాధించగా మ్యాట్నీ షోల కి కొన్ని సెంటర్స్ లో పుంజుకున్నా ఓవరాల్ గా మాత్రం యావరేజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మెల్లి మెల్లి గా పుంజు కుంటున్నాయి.
దాంతో అనుకున్న రేంజ్ లో సినిమా మొదటి రోజు బుకింగ్స్ విషయం లో ఇదే జోరు ని రెట్టింపు జోరు తో కొనసాగిస్తే తొలిరోజు 50 లక్షల రేంజ్ లో షేర్ రావడం పక్కా అని చెప్పాలి. కానీ బిజినెస్ 13.4 కోట్లు అవ్వడం తో తొలి రోజు కలెక్షన్స్ చాలా ముఖ్యం అనే చెప్పాలి.
ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల తో సినిమా ఇప్పటికే 60 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు సాధించింది, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల కి సినిమా మరింత గ్రోత్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అలా కాకుంటే మాత్రం తొలిరోజు కలెక్షన్స్…
30 లక్షల రేంజ్ లో రావచ్చు, కానీ టాక్ బాగుండటం తో కచ్చితంగా సినిమా డే ఎండింగ్ కి పుంజుకునే అవకాశం అయితే ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇప్పుడు సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి డే ఎండ్ కి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.