Y S R గారి పాద యాత్ర ఆధారంగా మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యాత్ర బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళ తో ప్రీ రిలీజ్ బిజినెస్ కి న్యాయం చేసే కలెక్షన్స్ ని అందుకుని సత్తా చాటింది, అంచనాలకు మించి మొదటి రోజు సినిమా కలెక్షన్స్ అన్ని ఏరియాల్లో సాలిడ్ గా రాగా రెండో రోజు కూడా సినిమా జోరు…
అదే రేంజ్ లో ఉంటుంది అని అంతా భావించారు, యాత్ర సినిమా కూడా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు తగ్గకుండా దుమ్ము లేపింది, ఆన్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో గ్రోత్ అంతంత మాత్రంగానే ఉన్నా కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ విషయం లో మాత్రం…
సినిమా జోరు అదుర్స్ అనే చెప్పాలి. రీసెంట్ టైం లో ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ కన్నా ఆఫ్ లైన్ థియేటర్ కౌంటర్ దగ్గర సేల్స్ బాగున్న అతి కొద్ది సినిమాలలో యాత్ర సినిమా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోల కలెక్షన్స్ గ్రోత్…
ముందు అనుకున్నట్లే ఉండే అవకాశం ఉంది, ఒకవేళ నైట్ షోల గ్రోత్ మరింత లెవల్ లో ఉంటే తప్పితే రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కలెక్షన్స్ మొత్తం మీద 1.5 కోట్ల కి అటూ ఇటూ గా ఉండే అవకాశమే ఎక్కువ గా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
13.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉండటం తో వీకెండ్ వసూళ్ళ తో సినిమా సగం వరకు బిజినెస్ ని రికవరీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి రెండో రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.