Y S రాజ శేఖర్ రెడ్డి గారి పాద యాత్ర ఆధారంగా కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్ర లో తెరకెక్కిన సినిమా యాత్ర. మంచి అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో ల తో రిలీజ్ అవ్వగా అక్కడ సినిమా కి ఫైనల్ గా ఎబో యావరేజ్ టాక్ లభించింది. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల లో రెగ్యులర్ షోల నుండి…
సినిమా కి ఫైనల్ గా ఎలాంటి టాక్ లభించింది, సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసు కుందాం పదండీ.. ముందుగా స్టొరీ లైన్ విషయానికి వస్తే పొలిటికల్ లీడర్ అయిన Y S రాజ శేఖర్ రెడ్డి పాద యాత్ర తో ఎలా ప్రజల లీడర్ అయ్యాడు అన్నది స్టొరీ పాయింట్.
చిన్న పాయింట్ అయినా పాద యాత్ర అప్పట్లో ఎలా సంచలనం సృష్టించిందో సినిమా లో కొన్ని సీన్స్ ని హైలెట్ చేస్తూ ఇతర పార్టీల వారు కూడా ఎలా Y S పథకాలను మెచ్చుకున్నారో బాగానే చూపెట్టాడు దర్శకుడు మహి వి రాఘవ్. కానీ సినిమా మొత్తం…
ఇదే పాయింట్ పైనే నడవడం తో అక్కడక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది, ఫ్యాన్స్ కి పార్టీ వారికి అలాగే Y S ని ఇష్టపడే వారికి పర్వాలేదు కానీ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ని ఎక్కువగా చూసే కామన్ ఆడియన్స్ కి మాత్రం ఇది కొంతవరకు ఇబ్బంది పెట్టె విషయమే అని చెప్పాలి.
ఈ మేజర్ మైనస్ పాయింట్స్ ని పక్కకు పెడితే నటన పరంగా మమ్ముట్టి అద్బుతంగా నటించి Y S R ని మరిపించి దుమ్ము లేపగా మిగిలిన పాత్రల్లో ఎక్కువగా జగపతి బాబు మరియు రావ్ రమేష్ లు మెప్పించారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా…
ఫీల్ కి తగ్గట్లు ఉన్నాయి, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే విషయం లో మరింత శ్రద్ధ తీసుకుని మరింత పకడ్బందీ స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ విషయం లో రాసుకుని ఉంటే రెగ్యులర్ సినీ లవర్స్ ని ఎక్కువగా మెప్పించే అవకాశం ఉండేది.
డైరెక్షన్ అక్కడే కొంచం వీక్ గా అనిపించింది, ఫస్టాఫ్ మలచిన తీరు, ఆకట్టుకోవడం తో సెకెండ్ ఆఫ్ విషయం లో కూడా అదే రిపీట్ అవుతుంది అనుకున్నా స్లో స్క్రీన్ ప్లే కొద్దిగా ఇబ్బంది పెట్టింది, కానీ మళ్ళీ క్లైమాక్స్ లో Y S R రియల్ ఫోటో లు అలాగే… చనిపోయినప్పటి దృశ్యాలు ప్రేక్షకులను కలచివేస్తాయి అని చెప్పొచ్చు. అదే సమయంలో చివర్లో Y S జగన్ ని చూపెట్టి చెప్పిన రెండు మాటలు పార్టీ ప్రమోషన్ ల అనిపించింది. అది ఒక్కటి తప్పితే సినిమా మొత్తం ఒక కామన్ ఆడియన్స్ ఇది బయోపిక్ అని గుర్తు పెట్టుకుని చూస్తె…
చాలా వరకు మెప్పించే అవకాశం ఉంది, కానీ కామన్ ఆడియన్స్ ఎంతవరకు సినిమాను ఓన్ చేసుకుంటారు అన్నది కొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేం. ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం అనలేం కానీ ఉన్నంతలో ఒకసారి చూడొచ్చు అన్న భావన కలిగించింది అని చెప్పాలి.
ఫైనల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…మీరు YSR ని ఇష్టపడే వారు అయితే సినిమా నచ్చుతుంది, కామన్ ఆడియన్స్ అయితే ఒకసారి చూసి పాదయాత్ర గురించి Y S R గురించి తెలుసుకునే చాన్స్ ఉంటుంది… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
worrest picture dirty