10 ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర రీ ఎంట్రీ తో 100 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రెండున్నర ఏళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా సైరా నరసింహా రెడ్డి, బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అద్బుతమైన రివ్యూ లను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతున్నా కానీ హిందీ మరియు మిగిలిన…
చోట్ల మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక షాక్ ఇస్తుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 97.7 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా 6 వ రోజు మ్యాట్నీ షోల సమయానికే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాక్ టు బాక్ 2 100 కోట్ల సినిమాలతో సంచలనం సృష్టించాడు. కాగా టాలీవుడ్ హీరోల్లో ఈ రికార్డ్ ను అందుకున్న మూడో హీరో గా మెగాస్టార్ చిరంజీవి సంచలనం సృష్టించాడు అని చెప్పొచ్చు. ఇది వరకు ప్రభాస్ మూడు సార్లు ఈ మార్క్ ని అందుకున్నాడు.
బాహుబలి సిరీస్ మరియు సాహో తో బాక్ టు బాక్ 3 సార్లు ఈ రికార్డ్ కొట్ట గా తర్వాత మహేష్ బాబు భరత్ అనే నేను మరియు మహర్షి లతో ఈ రికార్డ్ కొట్టాడు. భరత్ అనే నేను అఫీషియల్ కలెక్షన్స్ ఎవ్వరికీ తెలియవు కానీ సినిమా 100 కోట్లు దాటిందని అంచనా.
ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాక్ టు బాక్ 100 కోట్ల సినిమాలతో దుమ్ము లేపాడు, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. ఇక 6 వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.