కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి తమిళనాడులో 45 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 79 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా..
మూడో రోజు సినిమా అన్ని చోట్లా మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా తమిళ్ లో ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో 17-18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు…అంచనాలను మించితే…
ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా తెలుగుతో కలిపి రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి 1 మిలియన్ మార్క్ రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజున 28-29 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో మొత్తం మీద తమిళనాడులో 62-63 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా..
వరల్డ్ వైడ్ గా 106-108 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోబోతుంది. ఇంకా సినిమాకి 2 రోజుల హాలిడే అడ్వాంటేజ్ లు కూడా కలిసి రాబోతూ ఉండటంతో కలెక్షన్స్ పరంగా మరింత రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…