బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవడమే కాదు లాభాలను కూడా సొంతం చేసుకున్న మేజర్ మరియు విక్రమ్ మూవీస్ రెండూ ఇప్పుడు రెండో వారంలో అడుగు పెట్టగా అంటే సుందరానికీ సినిమా నుండి పోటిని ఎదురుకోవడంతో థియేటర్స్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి కానీ తిరిగి 9వ రోజు నుండి దుమ్ము లేపుతూ దూసుకు పోతున్నాయి…10వ రోజు 2 సినిమాలు మంచి జోరు చూపిస్తున్నాయి.
మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ 9వ రోజు లెవల్ లోనే హోల్డ్ చేయగా అవ్వగా సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక విక్రమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో…
ఆల్ మోస్ట్ 10% రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల రేంజ్ నుండి 90 లక్షల షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 10వ రోజు 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రెండు సినిమాల 10 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి….