టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు సర్కారు వారి పాట సెకెండ్ వీకెండ్ లో డీసెంట్ హోల్డ్ తో పరుగును కొనసాగిస్తుంది. సినిమా 9వ రోజు కొంచం అంచనాలను అందుకోలేక పోయినా పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా 10వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మంచి ట్రెండ్ నే చూపిస్తుంది అని చెప్పాలి, తెలుగు రాష్ట్రాలలో సినిమా 9వ రోజు కన్నా కూడా బెటర్ గానే హోల్డ్ చేయగా…
తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా అమెరికాలో 2.2 మిలియన్ మార్క్ ని…
అందుకుని దుమ్ము లేపగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల నుండి 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఔట్ రైట్ ఛాన్స్ ఉంది. ఇక మొత్తం మీద 10 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.