Home న్యూస్ 118 ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

118 ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!

0

 

   పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రేంజ్ కాకపోయినా మినిమం హిట్ కూడా రాలేదు. ఇలాంటి సమయం లో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో కే వి గుహన్ డైరెక్షన్ లో 118 అంటూ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన సినిమా తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు కళ్యాణ్ రామ్. మరి సినిమా ఎలా ఉందో తెలుసు కుందాం పదండీ..

ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి వస్తున్నా రెస్పాన్స్ అదిరి పోయింది అనే చెప్పాలి. కథ లో కొన్ని లోసగులు ఉన్నా కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కథ లో చాలా వరకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో తక్కువ రన్ టైం తో సినిమా తెరకెక్కిందని…

కళ్యాణ్ రామ్, నివేద థామస్ ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా శాలిని పాండే కూడా ఆకట్టుకుందని, ఫస్టాఫ్ కథ సూపర్ స్క్రీన్ ప్లే తో నడుస్తుందని, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ వస్తుందని, తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా….సెకెండ్ ఆఫ్ లో వచ్చే…

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచం సాదాసీదా గా అనిపించిందని, తర్వాత రెగ్యులర్ క్లైమాక్స్ కూడా ఊహించినట్లే ఉందని, అవి తప్పితే సినిమా ఈజీ గా ఒకసారి చూసే విధంగా ఉందని అంటున్నారు, రీసెంట్ టైం లో కళ్యాణ్ రామ్ చేసిన సినిమాల్లో బెస్ట్ అంటున్నారు.

ఓవరాల్ గా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ టాక్ లభించింది అని చెప్పాలి, ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుంది అన్న దాని పై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here