Home న్యూస్ 125CR లాభం….92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో రికార్డ్ ఇది!

125CR లాభం….92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో రికార్డ్ ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి కలెక్షన్స్ పరంగా ఎవ్వరి ఊహలకు కూడా అందని రేంజ్ భీభత్సం సృష్టించిన హనుమాన్(HanuMan Movie) హిస్టారికల్ కలెక్షన్స్ తో ఊహకందని లాభాలను సొంతం చేసుకోగా సినిమా 5వ వారంలో కూడా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

హిందీలో 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా తెలుగు లో ఆల్ రెడీ సంచలన కలెక్షన్స్ తో సందడి చేసింది. ఓవరాల్ గా సంక్రాంతికి బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీగా 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసిన హనుమాన్ మూవీ ఇప్పుడు ప్రాఫిట్ వైజ్ కూడా….

HanuMan Movie 30 Days Total WW Collections!

మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్ లో ఏ సినిమా కూడా సాధించని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది.. సినిమా 29.65 కోట్ల బిజినెస్ మీద 154.69 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని బిజినెస్ మీద ఏకంగా 125.09 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…

టాలీవుడ్ చరిత్రలో అతి కొద్ది సినిమాలు మాత్రమే 100 కోట్లకు పైగా లాభాన్ని అందుకోగా అందులో ఇప్పుడు ఏ మీడియం రేంజ్ మూవీకి సొంతం కాని విధంగా హనుమాన్ మూవీ 125 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఇక ఎండ్ స్టేజ్ కి వచ్చేయడంతో….

మిగిలిన రన్ లో సినిమా లాభాలను మరికొంత పెంచుకుని పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది, ఈ సినిమా రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమే…మీడియం రేంజ్ మూవీస్ అయితే కొన్నేళ్ళు ఈ సినిమా టార్గెట్ సెట్ చేసిందని చెప్పొచ్చు. మరి ఫ్యూచర్ లో ఏ సినిమా ఈ సినిమా రికార్డ్ ను టచ్ చేయగలుతుందో చూడాలి.

HanuMan Movie 31 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here