ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా టెలివిజన్ లో సినిమాలు షోలు భారీగానే టెలికాస్ట్ అవ్వగా అన్ని సినిమాలకు కూడా మరోసారి మంచి రేటింగ్ లు దక్కడం విశేషం అనే చెప్పాలి. వీకెండ్ మూవీస్ అన్నీ కూడా మరోసారి ఫుల్ డామినేషన్ తో సత్తా చాటుకున్నాయి. ఒకసారి ఆ వివరాలలోకి వెళితే.. ముందుగా బిగ్ బాస్ సీజన్ 13 వ వారానికి గాను సాధించిన రేటింగ్ లను ఒకసారి గమనిస్తే… శనివారం ఎపిసోడ్ కి గాను 9.06 రేటింగ్ ను సొంతం చేసుకోగా…
ఆది వారం ఎపిసోడ్ కి 11.09 రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇక వర్కింగ్ డేస్ లో 7.14 రేటింగ్ ను యావరేజ్ గా సొంతం చేసుకుని అంతకుముందు వారం తో పోల్చితే మంచి గ్రోత్ ని సొంతం చేసుకుంది, ఎండ్ స్టేజ్ కి రావడం తో షో ని మళ్ళీ ఎక్కువగా చూస్తున్నారు అని చెప్పొచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే విజయ్ జిల్లా ఫస్ట్ టైం టెలికాస్ట్ ను లేట్ గా సొంతం చేసుకున్న మంచి రేటింగ్ తో కుమ్మేయగా కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా టెలివిజన్ లో కూడా నిరాశ పరిచే రేటింగ్ ను సాధించింది, ఇక జ్యోతిక మగువలు మహారాణులు ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు.
ఇక రేసుగుర్రం సినిమా లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ రేటింగ్ ను సొంతం చేసుకోగా, ఓల్డ్ మూవీ రోబో, లయన్, రిపీట్ టెలికాస్ట్ లో ప్రతిరోజూ పండగే సత్తా చాటుకున్నాయి. మొత్తం మీద నవంబర్ 27 నుండి డిసెంబర్ 4 వరకు టెలికాస్ట్ అయిన సినిమాలలో అత్యధిక రేటింగ్ లను సొంతం చేసుకుని టాప్ లిస్టు లో చోటు దక్కించుకున్న అన్ని సినిమాలను ఒకసారి గమనిస్తే…
👉#RaceGurram – 5.67
👉#Jilla 1st time- 5.57
👉#PratirojuPandage – 4.16
👉#Robo – 4.11
👉#Penguin 1st Time – 3.64
👉#WorldFamourLover – 2.41
👉#Lion – 2.16
👉#Supreme – 1.88
👉#MaguvaluMathrame 1st time – 1.71
ఇవీ మొత్తం మీద అత్యధిక రేటింగ్ లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్…
వీటితో పాటు కన్నడలో డబ్ అయిన మూవీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 2.56 రేటింగ్ ను సొంతం చేసుకుని సినిమా రిజల్ట్ కి పర్వాలేదు అనిపించే రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇక లాస్ట్ వీక్ కి గాను ఎక్కువ సినిమాలే టెలికాస్ట్ అయ్యాయి కాబట్టి వాటి రేటింగ్ లు ఏ విధంగా ఉంటాయి ఏవి టాప్ లో ఉంటాయి లాంటి వివరాలు ఈ గురువారం రిలీజ్ అవుతాయి.