బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మూవీ బ్రో(BRO The Avatar) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అయినా వర్కింగ్ డేస్ లో హోల్డ్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేక పోవడంతో సినిమా మినిమం హోల్డ్ ని కూడా చూపించడం లేదు.
సినిమా రెండో వీకెండ్ తర్వాత 11వ రోజు వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 75% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి వర్కింగ్ డే లో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేదు.
ఓవరాల్ గా మరోసారి 12వ రోజున ఆల్ మోస్ట్ 30% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఇలానే ఉండే అవకాశం ఉండటంతో బ్రో మూవీ అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ ఈ రోజు 60 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేయగా…
కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటంతో ఇక సినిమా తేరుకునే అవకాశం లేక పోవడంతో ఇక పరుగును త్వరగానే సినిమా పూర్తి చేసుకోబోతుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 12 రోజుల్లో ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.