బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి వచ్చిన సినిమాలను అన్నింటినీ ఓ రేంజ్ లో డామినేట్ చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఊహకందని రాంపెజ్ ను చూపెడుతున్న సినిమా రెండో వీకెండ్ లో అడుగు పెట్టగా శనివారం రోజున అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపెడుతూ…
మాస్ రచ్చ చేస్తూ ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది….సినిమా కి ఈ వీకెండ్ లో నార్మల్ టికెట్ రేట్స్ పెట్టడం కూడా కలిసి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో థియేటర్స్ కి ఎగబడి వస్తున్నారు…దాంతో అన్ని చోట్లా సినిమా మాస్ రచ్చ చేస్తూ 11వ రోజు మీద సాలిడ్ గ్రోత్ ని చూపెడుతుంది.
సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా ఈ రోజు కుమ్మేస్తున్న సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 4-4.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
షేర్ 4.5-4.7 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….ఓవరాల్ గా సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా….
వరల్డ్ వైడ్ గా ప్రాఫిట్ ను ఇంకా పెంచుకుంటూ 100 కోట్ల ప్రాఫిట్ మార్జిన్ వైపు పరుగులు పెడుతుంది… ఓవరాల్ గా ఈ శని ఆదివారాల కలెక్షన్స్ ఈ అంచనాలను కూడా మించే అవకాశం ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 12 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.