టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ లు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే, రీమేక్ లలో రెండు రకాలు కూడా ఏర్పడ్డాయి.. ఒకటి ఒరిజినల్ వర్షన్ ని అలాగే రీమేక్ చేయడం, రెండోది ఆ ఒరిజినల్ మూవీ ఆల్ రెడీ ఇక్కడ డబ్ అయినా కానీ మళ్ళీ రీమేక్ చేయడం… ఈ రెండో కోవలోకే కాటమరాయుడు ఇప్పుడు లూసిఫర్ రీమేక్ లాంటి సినిమాలు వస్తాయి. వీటితో పాటు మరో సినిమా కూడా ఇలానే రీమేక్ కన్ఫాం అయింది…
కానీ ఎందుకనో ఇప్పటి వరకు ఇక్కడ మొదలు కాలేదు… ఆ సినిమానే కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన తెరీ సినిమా. ఈ సినిమా తెలుగు లో పోలీసోడు పేరుతొ ఆ టైం లో డబ్ అయి రిలీజ్ అయినా ఆశించిన కలెక్షన్స్ ని అందుకోలేదు.
టోటల్ గా మాత్రం 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని విజయ్ కెరీర్ లో అప్పటికి నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగు లో డబ్ అయినా ఇక్కడ రీమేక్ చేయాలనీ రైట్స్ కూడా కొన్నారు. ముందు పవన్ కళ్యాణ్ తో అనుకున్నారు సెట్ అవ్వలేదు…
తర్వాత రవితేజ తో ఆల్ మోస్ట్ ఫిక్స్ అనుకున్నారు మళ్ళీ ఆపేశారు. తర్వాత మరో ఒకరిద్దరి పేర్లు వినిపించాయి కానీ మళ్ళీ ఆగిపోగా ఈ లోపు సినిమా తెలుగు డబ్ మాస్టర్ ప్రింట్ కూడా రిలీజ్ అయ్యే సరికి సినిమా రీమేక్ ని అటకెక్కించారు. సుమారు కోటిన్నర పెట్టి తెలుగు రీమేక్ రైట్స్ కొన్న నిర్మాత…
ఇప్పుడు మళ్ళీ సినిమా రీమేక్ ని మొదలు పెట్టాలని ట్రై చేస్తున్నాడట. తెలుగు రీమేక్ కథలో మార్పులు చేర్పులు ఆల్ రెడీ చేశారని టాక్ ఉంది. కానీ ఈ 140 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి ఇప్పుడు హీరో కావాలట. మరి త్వరలోనే ఎవరో ఒకరు దొరుకుతారో లేక సినిమా తెలుగు రీమేక్ ని కంప్లీట్ గా ఆపెస్తారో చూడాలి మరి….
Bro, adhi adirindi kadu
Policodu