బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ 4 రోజులు పూర్తి అయ్యే టైంకి తమిళనాడులో 86 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్…
150 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు కూడా హాలిడే అడ్వాంటేజ్ లభించగా మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా తమిళనాడులో…
సాలిడ్ జోరుని చూపెడుతూ 14-15 కోట్లకు తగ్గని రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా కర్ణాటక తెలుగు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2 కోట్లు ఆ పైన వసూల్ చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ రేంజ్ లో గ్రాస్ ను అందుకునే…
అవకాశం ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా 21-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా తమిళనాడులో ఓవరాల్ గా…
100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 170-172 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద అజిత్ కుమార్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో హోల్డ్ చేస్తుందో చూడాలి…