Home న్యూస్ 175 కోట్లు…చిరు కెరీర్ నం1…ఊచకోత అంటే ఇదే!!

175 కోట్లు…చిరు కెరీర్ నం1…ఊచకోత అంటే ఇదే!!

0

   టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఖైదీ నంబర్ 150 తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డులను సృష్టించగా తర్వాత రెండున్నర ఏళ్ళు గ్యాప్ తీసుకుని చేసిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి సంచలన కలెక్షన్స్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సాలిడ్ వసూళ్ళ ని సాధిస్తూ దూసుకు పోతుంది. సినిమా 5 రోజుల్లోనే 97.7 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది.

ఇక 6 వ రోజు కూడా మంచి వసూళ్ళని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంటున్న సినిమా ఓవరాల్ గా 6వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 5.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో 6.5-7 కోట్ల రేంజ్ లో సినిమా 6 వ రోజు వసూళ్లు సాధించ వచ్చు.

దాంతో ఈ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 సినిమా కలెక్షన్స్ ని దాటేది మెగాస్టార్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఖైదీ నంబర్ 150 టోటల్ రన్ లో 104.6 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేయగా ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి…

6 రోజులలో టోటల్ గా 105 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా కూడా చిరు ఖైదీనంబర్ 150 ని అందుకున్న 164 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి ఇప్పుడు ఆల్ మోస్ట్ 170 కోట్ల నుండి 172 కోట్ల రేంజ్ గ్రాస్ ని సినిమా 6 రోజుల్లో అందుకోనుంది. 7 వ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా…

కంప్లీట్ 175 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించనుంది, హిందీ తమిళ్ మలయాళం లో సినిమా అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేసి ఉంటె ఈ లెక్క మరింత ముందుగా దాటాల్సింది కానీ ఇప్పుడు టోటల్ ప్రెజర్ తెలుగు రాష్ట్రాల మీదే పడినా సినిమా ఒక్కో అడుగు ముందుకేస్తూ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఇక 6 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ కొద్ది సేపట్లో రిలీజ్ కానున్నాయి.

Sye Raa Narasimha Reddy Advance Bookings Report & Day 1 Predictions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here