టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా మూడో వీకెండ్ లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో భారీ పోటిలో కొత్త సినిమాలను అన్నింటినీ కూడా డామినేట్ చేస్తూ రిమార్కబుల్ హోల్డ్ తో…
మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా రాంపెజ్ ఒకెత్తు అయితే రాయలసీమ ఏరియాలో సినిమా రాంపెజ్ మరో ఎత్తుగా చెప్పాలి ఇప్పుడు… 16వ రోజు దసరా హాలిడే అడ్వాంటేజ్ తో ఏకంగా కోటి షేర్ మార్క్ ని అధిగమించిన సినిమా…
ఇప్పుడు 17వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి కోటి చేరువ దాకా వెళ్ళింది…ఇది వరకు టాలీవుడ్ హిస్టరీలో 17వ రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సీడెడ్ లో అందుకున్న మూవీస్ లో…రంగస్థలం 50 లక్షల షేర్ ని, హనుమాన్ మూవీ 50 లక్షల షేర్ ని….పుష్ప మూవీ 68 లక్షల షేర్ ని…
బాహుబలి2 మూవీ 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 88 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని ఇక్కడ 17వ రోజు కలెక్షన్స్ పరంగా రికార్డ్ కొట్టింది. ఇక ఇప్పుడు దేవర మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి ఆల్ మోస్ట్ 95 లక్షల రేంజ్ లో షేర్ ని..
సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను సాధించింది…మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయిన సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో ఈ రేంజ్ లో అద్బుతాలు సృష్టించడం, 17వ రోజు ఇలాంటి రికార్దులు ఇక్కడ అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక లాంగ్ రన్ లో సీడెడ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.