మెగాస్టార్ చిరంజీవి మెగా కంబ్యాక్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండో వారంలో అడుగు పెట్టి ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉంది. సినిమా 8 రోజుల్లో మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 135 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 173 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా 9వ రోజున సినిమా మరోసారి…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 6.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 8 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 141 కోట్ల మార్క్ ని దాటబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 181 కోట్ల గ్రాస్ మార్క్ ని…
అందుకోబోతున్న సినిమా మిగిలిన రోజుల విధంగా అంచనాలను మరోసారి మించిపొతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆల్ రెడీ 100 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న సినిమా లాంగ్ రన్ లో లాభాలను ఇంకా పెంచుకోబోతుంది. ఇక సినిమా టోటల్ గా 9 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.