Home న్యూస్ ట్విట్టర్ లో అరవింద సమేత ట్రైలర్ నాన్ బాహుబలి రికార్డ్

ట్విట్టర్ లో అరవింద సమేత ట్రైలర్ నాన్ బాహుబలి రికార్డ్

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే.

ఇక ట్విట్టర్ లో కూడా రిలీజ్ అయినప్పటి నుండి ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది ఈ ట్రైలర్…రిలీజ్ అయిన నిమిషాల్లోనే ఇండియా మరియు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది… ఇక ట్రైలర్ కి రెస్పాన్స్ అదిరిపోగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా ట్విట్టర్ లో…

ఇప్పటి వరకు 1 లక్షా 60 వేలకు పైగా ట్వీట్స్ అరవింద సమేత ట్రైలర్ పై పోల్ అయ్యాయట…ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పొచ్చు, బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ సమయంలో 4 లక్షలకు పైగా ట్వీట్స్ పోల్ అవ్వగా తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్స్ ట్రెండ్ అయినా కానీ 1 లక్ష ట్వీట్స్ కూడా క్రాస్ కాలేదు…అలాంటిది అరవింద సమేత ఏకంగా 24 గంటలు ముగియకుండానే చరిత్ర సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here