బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మూడో వీక్ లో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా కుమ్మేస్తూ ఉండగా ఇప్పుడు సినిమాకి…
బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్లా మళ్ళీ రెట్టించిన జోరు చూపించడం మొదలు పెట్టిన సినిమా 18వ రోజు మీద సాలిడ్ జోరుని మార్నింగ్ షోల నుండే చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మాస్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 19వ రోజున సినిమా సాలిడ్ షేర్స్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 19వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే..
అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.1-2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కనుక ఈ అంచనాలను మించి 2.5 కోట్ల రేంజ్ కి చేరువ అయితే కనుక అది ఊహకందని ఊచకోత అని చెప్పాలి… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 19 రోజులకు గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.