బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా టైం లో బరిలోకి దిగిన చిన్న సినిమా పెళ్లి సందD పై రిలీజ్ అయినప్పుడు అసలు ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు లేవు, అలాగే రిలీజ్ అయిన తర్వాత సినిమా పై నెగటివ్ రివ్యూల ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఆ ఇంపాక్ట్ ని ఏమాత్రం చూపెట్టకుండా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాల్లో సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు, సీడెడ్ ఏరియాలో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి. సీడెడ్ ఏరియాలో ఈ సినిమా కి 1 కోటి బిజినెస్ జరిగింది, ఈ సినిమా పై కోటి ఏంటి అని అంతా అనుకున్నారు.
ఇక టాక్ కూడా నెగటివ్ గా ఉండటంతో ఇక్కడ రికవరీ అసాధ్యం అని అంతా అనుకున్నా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని సీడెడ్ లో సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఏకంగా 1.58 కోట్ల షేర్ తో పరుగును పూర్తీ చేసుకుని బిజినెస్ మీద 58 లక్షల కలెక్షన్స్ అధికంగా సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవ్వరూ అంచనా కూడా వేయలేదు.