Home న్యూస్ కర్ణాటక చరిత్ర తిరగరాసిన KGF ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!

కర్ణాటక చరిత్ర తిరగరాసిన KGF ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్!

0

  కన్నడ స్టార్ హీరోల సినిమాలలో ఏ సినిమా సాధించని విధంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన KGF మొదటి రోజు అన్ని భాషల్లో ఊచకోత కోసింది. కన్నడ ఇండస్ట్రీ లో తొలిరోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకున్న ఒకేఒక్క సినిమా గ నిలిచి సంచలనం సృష్టించిన ఈ సినిమా మిగిలిన భాషలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి రోజు మొత్తం మీద సరికొత్త చరిత్ర సృష్టించింది.

సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే..కర్ణాటకలో మొదటి రోజు 16.5 కోట్ల గ్రాస్ ని అందుకుంది, తెలుగు లో 1.5 కోట్ల గ్రాస్ ని, కేరళలో 25 లక్షల గ్రాస్ ని, తమిళ్ లో 90 లక్షల గ్రాస్ ని హిందీ వర్షన్ 3 కోట్ల గ్రాస్ ని అందుకుంది ఈ సినిమా.

ఓవర్సీస్ లో 1.1 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు కి గాను ఏకంగా 23.25 కోట్ల గ్రాస్ ని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. టోటల్ గా మొదటి రోజు షేర్ 12 కోట్ల రేంజ్ లో ఉండటం ఇక్కడ విశేషం. ఇక వీకెండ్ వసూళ్లు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here