కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం చాలా టైం ఎదురు చూడాల్సి వచ్చింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజుల రేంజ్ లో టైం తీసుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 39.15 కోట్ల రేంజ్ లో టోటల్ షేర్ ని సొంతం చేసుకున్న బంగార్రాజు సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర… టోటల్ గా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిన తర్వాత…
డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా అక్కడ కూడా సూపర్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపగా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ కి కొంచం టైం తీసుకోగా జీ తెలుగు లో వాళ్ళు మంచి ప్రమోషన్స్ తో సినిమా ను టెలికాస్ట్ కి ప్రమోట్ చేయగా…..
సినిమా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయిన వీకెండ్ లో టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా అప్పటికే జనాలు థియేటర్స్ లో డిజిటల్ లో చూసినా కానీ ఉన్నంతలో సాలిడ్ రేటింగ్ నే సొంతం చేసుకుంది… ఓవరాల్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన టైం లో సినిమా కి 14.07 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది అని సమాచారం.
ఇక నార్మల్ అలాగే HD ఛానెల్స్ లో కలిపి సినిమా కి మొత్తం మీద 14.77 రేంజ్ లో రేటింగ్ సొంతం అయ్యిందని సమాచారం. ఓవరాల్ గా జీ తెలుగు కి ఈ సినిమా అటు డిజిటల్ లో ఇటు టెలివిజన్ లో కూడా సూపర్ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది అని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర, డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో సినిమా కుమ్మేసింది అని చెప్పొచ్చు.