Home TRP రేటింగ్ 606 కోట్ల సినిమా…..TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

606 కోట్ల సినిమా…..TRP రేటింగ్ ఎంత వచ్చిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) జైలర్ సినిమా(Jailer Movie) తో అన్ని చోట్లా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన విషయం తెలిసిందే. తెలుగు లో సైతం సినిమా ఊహకందని వసూళ్ళని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంది.

రజినీకాంత్ కెరీర్ లో ఆల్ టైం ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ లాభాలను కూడా దక్కించుకుంది. తెలుగు వర్షన్ టోటల్ రన్ లో 99 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 606 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Jailer Movie Total WW Collections!

అలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న తర్వాత సినిమా డిజిటల్ లో కూడా భారీ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా అక్కడ మొదటి సారి సినిమాకి తెలుగు లో డీసెంట్ రేటింగ్ సొంతం అవ్వగా తమిళ్ లో మొదటి సారి సాలిడ్ రేటింగ్ ను అందుకుంది.

తమిళ్ లో సినిమా మొదటి సారి 15.59 రేటింగ్ ను సొంతం చేసుకోగా సినిమా తెలుగు లోకి వచ్చేసరికి సినిమా కి 6.3 రేటింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో ఇంకొంచం ఎక్కువ రేటింగ్ ను ఆశించినా కూడా ఓవరాల్ గా మంచి పెర్ఫార్మెన్స్ నే టెలివిజన్ లో చూపెట్టింది. ఇక టెలివిజన్ లో లాంగ్ రన్ లో ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here