బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన సీనియర్ హీరోలతో పోల్చితే చాలా తక్కువగానే సినిమాలు చేస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమాతో ఈ సంక్రాంతికి సందడి చేయగా….రిలీజ్ కి ముందు మిగిలిన సంక్రాంతి సినిమాలతో పోల్చితే చిన్న సినిమాలనే అనిపించినా కూడా…
రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ మిగిలిన సినిమాలను పక్కకు పెట్టేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి జై కొట్టడంతో కలెక్షన్స్ పరంగా అల్టిమేట్ ట్రెండ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….
9 రోజుల టైం కి ఏకంగా 200 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. 2025 ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ లో మొట్ట మొదటి 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీ గా సంచలనం సృష్టించి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు..
మొత్తం మీద 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 194.5 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమా 9వ రోజున కొంచం డ్రాప్ అయినా కూడా వరల్డ్ వైడ్ గా 6-6.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా 9వ రోజున సాధించిన కలెక్షన్స్ తో…
ఏకంగా 200 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని ఊరమాస్ జాతర సృష్టించింది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ ను సైంధవ్ తో సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాది తిరిగే లోపల…
రిమార్కబుల్ కలెక్షన్స్ తో తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించగా లాంగ్ రన్ లో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఒక్క సినిమాతో తనకి ఫ్యామిలీస్ లో ఇప్పటికీ ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అన్నది క్లియర్ గా చెప్పేశాడు వెంకీమామ…