ఈ కరోనా వల్ల అన్ని సినిమాలు ఏవి ఎప్పుడు వస్తాయి తెలియని పరిస్థితి నెలకొనగా…. థియేటర్స్ ఎప్పుడు తెరచుకుంటాయో అని ఎదురు చూసి చూసి ఇక తప్పక చాలా సినిమా లు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధ పడ్డాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఏకంగా 7 కొత్త సినిమా లు ఒకటి తర్వాత డైరెక్ట్ డిజిటల్ లోనే రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇవ్వగా ఓ రెండు సినిమాలు మాత్రం…
ఎట్టి పరిస్థితులలో కూడా డిజిటల్ రిలీజ్ చేయమని రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేశాయి. కానీ వాటి తో పాటు మరో బిగ్గెస్ట్ మూవీ అయిన సల్మాన్ ఖాన్ నటించిన రాదే సినిమా మాత్రం అటు రిలీజ్ డేట్ ని కానీ…
ఇటు డిజిటల్ రిలీజ్ గురించి కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు… దాంతో కొన్ని OTT యాప్స్ ఇప్పటికీ తమ ఆఫర్స్ ని వినిపిస్తూనే ఉన్నాయట. లేటెస్ట్ గా ఓ పెద్ద స్ట్రీమింగ్ యాప్ ఏకంగా సల్మాన్ సినిమా కి 200 కోట్ల రేంజ్ ఆఫర్ ని ఇస్తామని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ రేటు ఆల్ టైం హైయెస్ట్ అనే చెప్పాలి.
థియేట్రికల్ బిజినెస్ అయినా కానీ అటూ ఇటూ గా 100 నుండి 120 కోట్ల రేంజ్ లో అవుతుంది, ఆ రేటు తో చూసుకున్నా కానీ ఇది ఏకంగా 80 కోట్లు అధికం అనే చెప్పాలి. దాంతో ఆలోచనలో టీం ఉన్నట్లు తెలుస్తుంది కానీ సల్మాన్ కి మాత్రం ఈ ఆఫర్ కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానీ ఇష్టం లేదని అంటున్నారు.
థియేటర్స్ తెరిచాకే సినిమాను రిలీజ్ చేద్దామని అంటున్నాడని సమాచారం. ఒకవేళ పరిస్థితి ఇయర్ ఎండ్ టైం వరకు కూడా సెట్ కాకపొతే అప్పుడు ఆలోచిద్దామని అంటున్నాడని సమాచారం. మరి ఈ సినిమా సూర్యవంశీ, 83 వరల్డ్ కప్ లా థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందా లేక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుందా అన్నది మరికొంత కాలం ఆగితే తెలుస్తుంది అని చెప్పొచ్చు…