పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉండేవి, బాహుబలి తర్వాత సాహో లాంటి డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న కమర్షియల్ మూవీతో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ నుండి చాలా టైం తర్వాత వస్తున్న ప్యూర్ లవ్ స్టొరీ అవ్వడం, బాలీవుడ్ లో ఇలాంటి మూవీస్ కి ఆదరణ కూడా ఉందటంతో….
టాక్ ఏమాత్రం బాగున్నా కానీ అద్బుతమైన కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు, అటు హిందీ ఆడియన్స్ తో పాటు తెలుగు అలాగే ఇతర ఆడియన్స్ కూడా….
ఈ లవ్ స్టొరీ ని చూడటానికి అస్సలు ఆసక్తి చూపలేదు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వర్త్ బిజినెస్ ను అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది… ఫైనల్ రన్ లో కేవలం 83.20 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా….
బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఏకంగా 120 కోట్లకు పైగా నష్టాన్ని సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిపోగా తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ కూడా అద్బుతాలు ఏమి నమోదు చేయలేదు. ఇక రీసెంట్ గా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా జీ తెలుగు వాళ్ళు మంచి పబ్లిసిటీ లాంటివి చేసి సినిమాను బాగా ప్రమోట్ చేసి….
టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. కానీ అక్కడ కూడా సినిమా కి నిరాశ ఎదురు అయింది. ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ సినిమా కి కేవలం 8.25 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమె సొంతం అయింది అని చెప్పాలి. ఇది రీసెంట్ డిసాస్టర్ మూవీస్ కొన్నింటితో కంపేర్ చేసినా తక్కువే అని చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ నుండి టెలివిజన్ వరకు అన్ని చోట్లా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.