బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా 2018. తెలుగులో రీసెంట్ గా డబ్ అయిన ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు 12 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 9.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకోగా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 175 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి మలయాళంలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
అలాంటి ఈ సినిమాను రీసెంట్ గా రిలీజ్ అయిన 5 వారాల తర్వాత డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకుని రీసెంట్ గా సినిమా సోని లివ్ లో డిజిటల్ రిలీజ్ అన్ని భాషల్లో అయిపొయింది. దాంతో సినిమాను డిజిటల్ లో చూడాలి అనుకుంటున్న వాళ్ళు ఎగబడి చూస్తూ ఉండగా…
మరో పక్క ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో మంచి రెవెన్యూని సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ ఇలా డిజిటల్ లో ఇంత త్వరగా రిలీజ్ చేయడం నచ్చని కేరళ థియేటర్స్ ఓనర్స్ దీనికి నిరసనగా జూన్ 7-8 తేదీలలో థియేటర్స్ ని మూసేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ చేశారు…
ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ రిలీజ్ అవ్వడానికి మినిమమ్ 45 నుండి 60 రోజుల టైం గ్యాప్ ఉండాలని, అలా అయితేనే జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూస్తారు అంటూ గొడవ చేస్తున్నారట. ఇప్పుడు 2018 మూవీ డిజిటల్ రిలీజ్ తో థియేటర్స్ ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా 200 కోట్ల మార్క్ ని అందుకుంటుంది అనుకున్నా ఇప్పుడు చాలా దూరంలోనే ఆగిపోబోతుంది.