బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో పెద్ద హీరోలు నటించిన సినిమాలు చాలానే వచ్చాయి… వాటిలో ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ అండ్ ఆ రేంజ్ లోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మరో లెవల్ లో సొంతం చేసుకుంది. మిగిలిన పెద్ద మూవీస్ లో భీమ్లా నాయక్ సినిమా కి సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా….
ఆచార్య, రాధే శ్యామ్ సినిమాలకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వగా రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కాగా అన్ని సినిమాల్లో తెలుగు రాష్ట్రాలలో ప్రతీ రోజూ కోటికి….
తగ్గకుండా షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో సర్కారు వారి పాట మిగిలిన సినిమాల కన్నా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఆచార్య సినిమా కేవలం 3 రోజులు మాత్రమే కోటికి తగ్గకుండా షేర్ ని అందుకోగా రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు మాత్రమే కోటికి తగ్గకుండా….
షేర్ ని సొంతం చేసుకుంది… ఇక భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ తో కూడా 6 రోజులు మాత్రమే కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది. ఇక వీటితో పాటు నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సర్కారు వారి పాట సినిమా మాత్రం నాన్ స్టాప్ గా 11 రోజుల పాటు రోజుకి కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని 12 వ రోజు స్లో డౌన్ అయింది ఇప్పుడు…
దాంతో ఈ ఇయర్ వచ్చిన బిగ్ మూవీస్ లో సర్కారు వారి పాట వీక్ టాక్ తో బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ తో కూడా 6 రోజులకే సరిపెట్టుకుంది. ఇక రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీనే అయినా నిరాశ పరచగా ఆచార్య సినిమా అన్ని సినిమాల లోకి వీకేస్ట్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి.