కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) మీద రీసెంట్ టైంలో ఏ తమిళ్ మూవీ మీద లేనన్ని అంచనాలు ఏర్పడగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మరీ అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేక పోయినా కూడా…
ఓవరాల్ గా ఆడియన్స్ నుండి సినిమాకి రెస్పాన్స్ మాత్రం సాలిడ్ గానే ఉండేలా ఉందని చెప్పాలి. సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం బజ్ తగ్గినట్లు అనిపించినా ఆ ఎఫెక్ట్ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై ఏమాత్రం ఇంపాక్ట్ పడలేదు అనే చెప్పాలి.
రిలీజ్ కి ఇంకా వారం పది రోజుల టైం ఇంకా ఉండగానే ఓవర్సీస్ లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఓ రేంజ్ లో కొనసాగుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో ఏకంగా 20 కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకుంది.
టోటల్ ఓవర్సీస్ లో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 2.5 మిలియన్ డాలర్స్ కి పైగా సొంతం చేసుకున్న లియో మూవీ వీకెండ్ బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఉండటంతో రిలీజ్ టైంకి 25 కోట్లకు పైగా మినిమం ఓపెనింగ్స్ ను ఓవర్సీస్ లో సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఇక సినిమా ఇండియా అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ఓపెన్ కాబోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో భారీ పోటిలో రిలీజ్ కాబోతున్న లియో మూవీకి ఇక్కడ టాక్ చాలా కీలకం అని చెప్పొచ్చు. మరి సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుందో చూడాలి.