Home న్యూస్ అక్షరాలా 22 కోట్లు…ట్రేడ్ కి మైండ్ బ్లాంక్!!

అక్షరాలా 22 కోట్లు…ట్రేడ్ కి మైండ్ బ్లాంక్!!

0

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మొదటి హిట్ మూవీ రాక్షసుడు సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఆ సినిమా ను తమిళ్ లో విష్ణు విశాల్ అనే హీరో చేయగా అక్కడ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమానే బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు లో అదే పేరుతొ రీమేక్ చేసి ఇక్కడ సూపర్ హిట్ ను సొంతం చేసుకుని కెరీర్ లో మొట్ట మొదటి హిట్ ని దక్కించు కున్నాడు.

ఒరిజినల్ హీరో విష్ణు విశాల్ తర్వాత చేసిన సినిమాల్లో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తమిళ్ తో పాటు తెలుగు లో రూపొందిన లేటెస్ట్ మూవీ FIR సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం ఖిలాడి తో పోటి పడుతూ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా….

ఆశ్యర్యకరంగా ఈ సినిమాను తెలుగు లో రవితేజనే సమర్పిస్తూ ఉండటం అది కూడా తన సినిమాకి పోటిగా రిలీజ్ చేస్తూ ఉండటం విశేషం. సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే ఉండగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 15 కోట్ల రేంజ్ లో రూపొందింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ సినిమా మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ తో…

ఇప్పుడు బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుంది. సినిమా కి తమిళ్ తో పాటు తెలుగు లో కలిపి డిజిటల్, శాటిలైట్, హిందీ మరియు మ్యూజిక్ రైట్స్ తో కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల దాకా జరిగిందట… ఇది హీరో విష్ణు విశాల్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అని తనే స్వయంగా అనౌన్స్ చేశారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ…టేబుల్ ప్రాఫిట్ 7 కోట్ల తో రిలీజ్ కాబోతూ ఉండగా…….

థియేటర్స్ లో ఎంత వస్తే అంత ప్రాఫిట్ అనే చెప్పాలి కానీ ఓవరాల్ గా తమిళ్ అండ్ తెలుగు కలిపి బిజినెస్ వాల్యూ ఓ 8-10 కోట్ల మధ్యలో ఉంటుందని అంటున్నారు. తెలుగు బిజినెస్ వాల్యూ ఇందులో 2.5 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు. ఆ లెక్కన తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 3 కోట్ల రేంజ్ వసూళ్లు సినిమా అందుకోవాలి… ఈ సీరియస్ సబ్జెక్ట్ తో ఈ రేంజ్ ప్రాఫిట్స్ చూసి ట్రేడ్ కూడా ఆశ్యర్యపోయారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here