రానా దగ్గుబాటి నటించిన లేటెస్ట్ మూవీ అరణ్య బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా ఈ నెల 26 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు, కాగా ట్రైలర్ కి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కగా యూట్యూబ్ లో వ్యూస్ పరంగా ట్రైలర్ సంచలనాలను నమోదు చేసి టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరంగా అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది…
దాంతో పాటే ఓవరాల్ గా టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో కూడా ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా ట్రైలర్… మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి అరణ్య ట్రైలర్ కి 8.322 మిలియన్స్ అప్ డేటెడ్ వ్యూస్ అండ్ 120.9K లైక్స్ వచ్చాయి.
లైక్స్ పరంగా మరీ అద్బుతాలు సృష్టించకున్నా కానీ వ్యూస్ పరంగా మాత్రం కొత్త రికార్డులను నమోదు చేసింది, టైర్ 2 హీరోలలో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న ట్రైలర్స్ లో టాప్ ప్లేస్ లో మంచి లీడ్ ని సొంతం చేసుకుంది ఈ ట్రైలర్. ఒకసారి టాప్ లిస్టు ను గమనిస్తే…
👉#Aranya – 8.322M***
👉#VTheMovie- 7.45M
👉#Check – 4.94M
👉#DearComrade- 4.84M
👉#REDTheFilm- 4.14M
👉#WorldFamousLover- 4.11 M
👉#SoloBratukeSoBetter- 4.11 M
ఇక లైక్స్ పరంగా హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న ట్రైలర్స్ ని గమనిస్తే…
👉#Check: 258K Likes****
👉#DearComrade: 234K
👉#VTheMovie: 224K
👉#WorldFamousLover: 185K
👉#REDTheFilm: 176K
👉#iSmartShankar: 145K
ఈ లిస్టులో మాత్రం ఎంటర్ అవ్వలేక పోయింది అరణ్య ట్రైలర్…
ఇక టాలీవుడ్ తరుపున ఓవరాల్ గా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న సినిమాల ట్రైలర్ లను గమనిస్తే…
👉#Baahubali2: 21.81M
👉#Saaho: 12.32M
👉#Penguin – 8.47M
👉#Aranya – 8.322M****
👉#VTheMovie – 7.45M
👉#Maharshi: 7.31M
👉#SarileruNeekevvaru: 7.26M
మొత్తం మీద అరణ్య ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 26 న పోటి లో ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి..