డిసెంబర్ 5న బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా నుండి ఆల్ రెడీ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఓ రేంజ్ లో హైప్ ను పెంచేస్తూ ఉండగా…
రీసెంట్ గా సినిమా నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఐటెం సాంగ్ అయిన కిస్సిక్(#KISSIK (#Pushpa2TheRule) సాంగ్, ఓవరాల్ గా పుష్ప లోని ఊ అంటావా సాంగ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోక పోయినా కూడా ఓవరాల్ గా మంచి రీచ్ ను సాధించింది…
లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ రికార్డుల బెండు తీసిన ఈ సాంగ్ తర్వాత సౌత్ రికార్డులను కూడా బ్రేక్ చేసి అప్ కమింగ్ లిరికల్ సాంగ్స్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి…
మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి కిస్సిక్ సాంగ్ కి వ్యూస్ పరంగా 27.19 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా ప్రీవియస్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి మంచి మార్జిన్ తో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది…ఇక లైక్స్ పరంగా మాత్రం ఈ సాంగ్ 24 గంటల్లో…
470.4K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా పర్వాలేదు అనిపించుకుంది….టాలీవుడ్ టాప్ 10 లో కూడా లైక్స్ పరంగా ఎంటర్ అవ్వలేక పోయినా కూడా వ్యూస్ పరంగా టాలీవుడ్ అండ్ సౌత్ రికార్డులను బ్రేక్ చేసిన ఈ సాంగ్ సాలిడ్ రచ్చ చేసింది అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా గ్రాండ్ రిలీజ్ కి టైం దగ్గర పడుతూ ఉండగా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ లెవల్ లో రికార్డుల దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి.