Home న్యూస్ డే 2 వీర లెవల్ లో కుమ్మేసిన ఫైటర్ మూవీ…2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

డే 2 వీర లెవల్ లో కుమ్మేసిన ఫైటర్ మూవీ…2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన లేటెస్ట్ ఒవీ ఫైటర్(Fighter Movie), బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ డే వీకెండ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే విధంగా రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి రోజున ఈ సినిమా హృతిక్ నటించిన ప్రీవియస్ మూవీ…

వార్ ఓపెనింగ్స్ తో పోల్చితే సగం ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకున్నా కూడా రెండో రోజు రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. మొదటి రోజున 24.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

రెండో రోజు మాత్రం సాలిడ్ గా ట్రెండ్ అయ్యి 41.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సాలిడ్ గ్రోత్ ని చూపించింది. టోటల్ గా సినిమా 2 రోజుల్లో ఇండియాలో 65.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా ఇండియా టోటల్ గ్రాస్ లెక్క 78 కోట్లకు పైగా ఉండగా సినిమా ఓవర్సీస్ లో మొత్తం మీద 2 రోజుల్లో…

22 కోట్ల దాకా గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది, దాంతో టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది, మొత్తం మీద రెండో రోజు గ్రోత్ తో జోరు పెంచిన సినిమా 3 వ రోజు 4వ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో ఇలానే జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here