Home న్యూస్ ప్రేమలు తెలుగు 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

ప్రేమలు తెలుగు 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్ డేట్!

0

మలయాళంలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ప్రేమలు(Premalu Movie Telugu Collections) రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమా కి ఇక్కడ ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక కుమ్మేయడం ఖాయమని అనుకోగా….

సినిమా ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్ళని సాధించింది…ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ తో కలిపి 73 వేల డాలర్స్ దాకా వసూళ్ళని సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు 10 లక్షల రేంజ్ లో, డే 1 మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో రెండో రోజు 55 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ట్రాక్ చేసిన సెంటర్స్ లో…

సొంతం చేసుకోగా మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో ఓవరాల్ గా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 1.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 90 లక్షల లోపు షేర్ ని అటూ ఇటూగా సొంతం చేసుకుందని అంచనా…

ఓవరాల్ గా సినిమాను ఓన్ గానే రిలీజ్ చేయగా వాల్యూ బిజినెస్ రేంజ్ 1.2 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉండగా 1.5 కోట్ల లోపు షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుందని చెప్పాలి. సినిమా ఊపు చూస్తూ ఉంటే సినిమా మొదటి వారంలో మంచి లాభాలను సొంతం చేసుకుని పరుగును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here