పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన మాస్ మూవీ సలార్(Salaar Movie)సినిమా గ్రాండ్ గా రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా అన్ సీజన్ లో ఎలాంటి అకేషన్ లేకుండా రిలీజ్ అయినా కూడా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా…
తెలుగు రాష్ట్రాలలో 2.75 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 3.18 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఫెంటాస్టిక్ హోల్డ్ తో దుమ్ము దుమారం లేపింది…ఇక రెండో రోజులో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరునే చూపించి కుమ్మేయడం విశేషం…
ఆల్ మోస్ట్ 8 వేల లోపు టికెట్ సేల్స్ ను రెండో రోజున సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించి కుమ్మేసిన సలార్ మూవీ రీ రిలీజ్ లో రెండో రోజు ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 40 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం…
దాంతో మొత్తం మీద సినిమా రెండు రోజులు పూర్తి అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో 3.58 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
ఇక సినిమా వీకెండ్ లో ఇలానే జోరు చూపించే అవకాశం ఉండగా IPL మ్యాచులు ఉన్నప్పటికీ పోటిలో ఒక్క కోర్ట్ తప్ప మిగిలిన ఏ సినిమాలు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోతూ ఉండటంతో కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.