టాలీవుడ్ ఇండస్ట్రీకి అన్ని సీజన్ లలోకి సంక్రాంతి సీజన్ ఫస్ట్ బెస్ట్ సీజన్ అని చెప్పాలి. ఆ తర్వాత సమ్మర్, దసరా సీజన్ లు మేజర్ గా సినిమాలకు బాగా కలిసి వస్తాయి…కానీ రీసెంట్ టైంలో ఒక్క సంక్రాంతి సీజన్ మాత్రమె టాలీవుడ్ కి బాగా కలిసి వస్తూ ఉండగా దసరా సీజన్ లో కొన్ని సినిమాలు మాత్రమే జోరు చూపిస్తున్నాయి…
కానీ ఎప్పుడూ స్టడీగా ఉండే సమ్మర్ సీజన్ మాత్రం లాస్ట్ రెండు ఏళ్ల నుండి స్లో అవుతూ వస్తుంది… 2022 లో పెండింగ్ లో ఉన్న బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో ఫుల్ సందడిగా ఉండగా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కేవలం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ఒక్కటే రిలీజ్ అయ్యి ఎంతో కొంత పర్వాలేదు అనిపించింది.
పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు సమ్మర్ లో ఒక టైంలో భారీగా పోటి పడుతూ ఉండేవి కానీ లాస్ట్ ఇయర్ నుండి స్టార్స్ నటించిన సినిమాల్లో ఒక్క సర్కారు వారి పాట తప్పితే ఒక్క పెద్ద సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ అవ్వలేదు… ఈ ఇయర్ సమ్మర్ మీద భారీ ఆశలు పెట్టుకోగా ఎలక్షన్స్ ఇంపాక్ట్ వలన…
సమ్మర్ లో పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అవ్వగా ఏప్రిల్ నుండి జూన్ వరకు ఒక్క టాప్ స్టార్ సినిమా కూడా లేనుండానే చప్పగా సాగుతూ ఉండగా లాస్ట్ ఇయర్ అయినా మీడియం రేంజ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ ఈ ఇయర్ అయితే ఇప్పటి నుండి మే ఎండ్ వరకు నోటబుల్ మూవీస్ ఒకటి రెండు తప్పితే ఏమి లేవనే చెప్పాలి….
రెండున్నర నెలలు కంప్లీట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ లేకుండా థియేటర్స్ ఫీడింగ్ లేకుండా అయిపొయింది… చాలా సినిమాలు ఎలక్షన్స్ అయ్యే వరకు రిలీజ్ కి ఏమాత్రం సిద్ధంగా లేవు….దాంతో అన్ని సినిమాలు సెకెండ్ ఆఫ్ లోనే రిలీజ్ కానుండటంతో రీసెంట్ టైంలోనే వన్ ఆఫ్ ది వరస్ట్ సమ్మర్ గా 2024 సమ్మర్ నిలిచింది అని చెప్పాలి.