బాక్స్ ఆఫీస్ దగ్గర 2025 ఇయర్ టాలీవుడ్ కి ఎక్స్ లెంట్ స్టార్ట్ ను ఇచ్చింది అని చెప్పాలి మొదటి 2 నెలల్లో….గేమ్ చేంజర్ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలం అయినా 200 కోట్ల గ్రాస్ ను అందుకుంది…డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ ని పూర్తిగా దాటకున్నా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
వీటిని ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహకందని మాస్ రాంపెజ్ ను చూపించగా…మొదటి నెలలో ఈ మూడు సినిమాలు ఓవరాల్ గా కుమ్మేసిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో తండేల్ మూవీ…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ సాలిడ్ గా జోరు చూపెడుతూ నాగ చైతన్యకి మాస్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది. నాన్ స్టాప్ గా 10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది…ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో మూడో 10 రోజులకు తగ్గకుండా 1 కోటి షేర్ మార్క్ ని అందుకున్న..
సినిమాగా నిలిచింది తండేల్ మూవీ…ఫస్ట్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని 20 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత డిసాస్టర్ రెస్పాన్స్ తో కూడా గేమ్ చేంజర్ మూవీ…
10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది. ఇక ఇప్పుడు అన్ సీజన్ లో తండేల్ మూవీ 10 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేయగా నాలుగో ప్లేస్ లో డాకు మహారాజ్ మూవీ 8 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా ఈ ఇయర్ మొదటి 2 నెలల్లో ఈ సినిమాలు ఓవరాల్ గా సాలిడ్ జోరునే తెలుగు రాష్ట్రాల్లో చూపించాయి అని చెప్పాలి. ఇక ఈ ఇయర్ ఎండ్ టైంకి మరిన్ని క్రేజీ సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రాంపెజ్ ను చూపించి ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.
Game changer Pan india film la release aindi remaining movies ala kadu so comparison apeyy…