మొదటి కన్నడ ఇండస్ట్రీ రికార్డులు అన్నీ తిరగరాసిన కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఈ ఇయర్ కూడా సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని ఆర్ ఆర్ ఆర్ తర్వాత సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 164 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఓపెన్ అవ్వగా ఇప్పుడు రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్…
35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగున్నాయి. దాంతో సినిమా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే 11 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
11.5 కోట్ల నుండి 12 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక సినిమా కర్ణాటకలో రెండో రోజు 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉండగా హిందీ లో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తున్న సినిమా 48-50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునేలా ఉంది ఇప్పుడు…
ఇక తమిళనాడు మరియు కేరళలో మొత్తం మీద రెండో రోజు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద ఇండియా లో రెండో రోజు కలెక్షన్స్ పరంగా 95 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తే సినిమా రెండో రోజు మొత్తం మీద…
110 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు… మొత్తం మీద రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కలెక్షన్స్ జాతరని తలపిస్తూ దూసుకు పోతున్న కేజిఎఫ్ 2 సినిమా డే 2 ఎండ్ అయ్యే టైం కి ఇదే రేంజ్ లో ఉంటుందా లేక ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందో చూడాలి ఇక…