Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 2 కలెక్షన్స్…సాలిడ్ గా కుమ్మాడు!!

ప్రతీరోజూ పండగే డే 2 కలెక్షన్స్…సాలిడ్ గా కుమ్మాడు!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మంచి వసూళ్ళతో దూసుకు పోతుంది, తొలి రోజు ఇతర సినిమాల పోటి వల్ల స్లో గా మొదలు అయినా రోజు ను బాగానే ముగించిన సినిమా రెండో రోజు జోరు చూపుతుంది.

పోటి లో ఉన్న మాస్ కమర్షియల్ మూవీ అయిన రూలర్ ని కూడా దాటేసే రేంజ్ లో రెండో రోజు సినిమా గ్రోత్ కొనసాగుతుంది, మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు తొలి 2 షోలకి ద్రపాస్ కేవలం 40% లోపే ఉండగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి.

మొత్తం మీద 15% వరకు గ్రోత్ ని సాధించి దుమ్ము లేపింది, దాంతో సినిమా ఇప్పుడు రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల నుండి 2 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా ఆఫ్ లైన్ లెక్కలు పూర్తిగా తేలాల్సి ఉండగా…

అవి కూడా అనుకున్నట్లు ఉంటె 2 వ రోజు షేర్ 2 కోట్లకు పైగానే ఉంటుంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం గట్టిగా ఉంది, దాంతో పాటు మించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు.

దాంతో ఓవరాల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు 6.8 కోట్ల నుండి 7 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది, అంటే సినిమా రెండో రోజు భారీ లెవల్ లో కుమ్మినట్లే.. ఇక 2 రోజుల ప్రతీరోజూ పండగే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here