Home న్యూస్ రూలర్ డే 2 కలెక్షన్స్…..షాకింగ్ కలెక్షన్స్!!

రూలర్ డే 2 కలెక్షన్స్…..షాకింగ్ కలెక్షన్స్!!

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మొత్తం మీద పోటి వలన మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేలా కనిపించడం లేదు, సినిమా ఒక్క సీడెడ్ ఏరియా లోనే జోరు చూపుతుండగా…

మిగిలిన ఏరియాల్లో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకునే కలెక్షన్స్ ని సాధిస్తుంది, సినిమా మొత్తం మీద మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు తొలి 2 షోల డ్రాప్స్ 50% కన్నా ఎక్కువగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి మొత్తం మీద 5 టు 8% వరకు గ్రోత్ ని సొంతం చేసుకుంది.

దాంతో మొత్తం మీద ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ముందు అనుకున్నట్లు గానే 1.8 కోట్ల నుండి 2 కోట్ల లోపు షేర్ ని అందుకునే అవకాశామే ఎక్కువగా ఉంది, ఒకవేళ మిగిలిన మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్..

ఎక్కువగా ఉంటె 2 కోట్ల మార్క్ ని అధిగమించవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజు 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, దాంతో రెండో రోజు మొత్తం మీద చూసుకుంటే ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా…

సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా అండ్ పోటి లో ఉన్న సినిమాల దృశ్యా మాత్రం టార్గెట్ ని అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. సినిమా కి మొదటి రోజు కి మించి కలెక్షన్స్ దక్కే రోజు అవసరం ఇప్పుడు, లేదా మొదటి రోజు లెవల్ కి తగ్గని కంటిన్యు కలెక్షన్స్ రావాలి… ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here