బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. కాగా సినిమా మొదటి వీకెండ్ లో మంచి వసూళ్ళని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో టికెట్ హైక్స్ ఎక్కువగా ఉండటంతో డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడగా…
టికెట్ రేట్స్ తగ్గింపు ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురు చూడగా సినిమా టికెట్ హైక్స్ ని రెండో వారంలో తగ్గించారు. నైజాంలో మల్టిప్లెక్సులలో 250 టు 295 రేటు చేయగా సింగిల్ స్క్రీన్స్ లో 150 నుండి 175 వరకు రేట్స్ ని ఫిక్స్ చేశారు. ఇక ఆంధ్రలో 150, 175, 200 వరకు టికెట్ రేట్స్ ఉండగా…
మల్టిప్లెక్సులలో 250 నుండి 300 వరకు టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. ఇవి కూడా భారీ రేట్లు అనే చెప్పాలి కానీ ఫస్ట్ వీక్ తో పోల్చితే ఇవి కొంచం తక్కువే కాబట్టి ఈ వీకెండ్ లో సినిమా తగ్గించిన రేట్స్ వలన ఎంతవరకు అడ్వాంటేజ్ తో కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి ఇక…అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా వీకెండ్ లో సినిమా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.