బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇక రెండో రోజులో ఎంటర్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోతుంది ఇప్పుడు… సినిమా మొదటి రోజుతో పోల్చితే సినిమా రెండో రోజు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఆఫ్ లైన్ లో కూడా సినిమా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమా ఈ రోజు కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఇప్పుడు…
కష్టంగానే కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే లెక్క 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా ఏమైనా గ్రోత్ ని చూపించి కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.