బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్ డే రోజున సినిమా అనుకున్న అంచనాలను సినిమా…
మించి పోయి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా డబుల్ డిజిట్ గ్రాస్ ను మొదటి రోజున సొంతం చేసుకోగా రెండో రోజు లో సినిమా మరింత రచ్చ చేస్తూ దూసుకు పోతుంది. తమిళ్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజు మీద 60% రేంజ్ లో గ్రోత్…
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న సినిమా నైట్ షోలకు మరింతగా జోరు చూపించే అవకాశం ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఓవరాల్ గా 1.5-1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా..
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా 8-9 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఓవర్సీస్ లో కూడా సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ సినిమా కుమ్మేస్తూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా రెండో రోజున సినిమా 14-15 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ సీజన్ లో ఇది ఊరమాస్ రాంపెజ్ అని చెప్పాలి. ఇక టోటల్ గా 2 రోజుల సినిమా ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.