బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి అద్బుతమైన పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మూడో వారంలో అడుగు పెట్టగా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా కల్కి రాంపెజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం జోరు తగ్గలేదు సరికదా…
ఇప్పుడు ఏకంగా కొత్త రిలీజ్ అయిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. రెండో రోజులో ఉన్న ఈ సినిమా మిక్సుట్ టాక్ తోనే ఉన్నా కూడా శంకర్(Director Shankar) కమల్ హాసన్(Kamal Haasan) ల కాంబో మూవీకి వీకెండ్ టాక్ ఎలా ఉన్నా కుమ్మేస్తుంది అనుకున్నారు..
కానీ రెండో రోజు టోటల్ ఇండియా వైడ్ గా భారతీయుడు2 టికెట్ సేల్స్ కన్నా కూడా 17 వ రోజులో ఉన్న కల్కి మూవీ టికెట్ సేల్స్ ఇండియా వైడ్ గా భారీ లెవల్ లో ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచింది ఇప్పుడు… భారతీయుడు2 మూవీ తెలుగు వర్షన్ మొత్తం మీద 65 వేల టికెట్ సేల్స్ ను…
2వ రోజు సొంతం చేసుకోగా టోటల్ ఇండియా వైడ్ గా అన్ని భాషలు కలిపి 2 లక్షల 25 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…అదే టైంలో 17వ రోజులో ఉన్న కల్కి మూవీ ఇండియా వైడ్ గా 3 లక్షల 63 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు…
అంటే రెండు సినిమాల మధ్య టికెట్ సేల్స్ గ్యాప్ ఆల్ మోస్ట్ 1 లక్షా 40 వేల రేంజ్ దాకా ఉండటం కల్కి బాక్స్ ఆఫీస్ డామినేషన్ కి నిదర్శనం అని చెప్పాలి ఇప్పుడు. భారతీయుడు2కి మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన టికెట్ హైక్స్ ఎక్కువగా ఉండటంతో…
డ్రాప్స్ ఎక్కువగా రాగా మూడో వీక్ లో టికెట్ హైక్స్ తగ్గడం వలన కల్కిని చూడటానికి జనాలు ఎగబడి థియేటర్స్ కి వస్తూ ఉండటం విశేషం. ఎంతైనా కొత్త పాన్ ఇండియా మూవీని 17వ రోజులో ఉన్న మరో మూవీ ఇలా బీట్ చేయడం మాములు విషయం కాదనే చెప్పాలి.