బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది… రెండు తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ప్రీవియస్ రికార్డుల బెండు తీసి కొత్త రికార్డులతో ఊచకోత కోశాయి అని చెప్పాలి…
సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే ఛాన్స్ ఉందని భావించగా సినిమా అనుకున్నట్లే ఆ అంచనాలను మించి పోయి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. నైజాం లో కూడా రికార్డ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది..
మొత్తం మీద సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 15.05Cr
👉Ceeded: 6.40Cr
👉UA: 4.14Cr
👉East: 1.72Cr
👉West: 1.10Cr
👉Guntur: 1.95Cr
👉Krishna: 2.18Cr
👉Nellore: 96L
AP-TG Total:- 33.53CR(50.60CR~ Gross)
ఇవీ సినిమా మూడో రోజు సాధించిన కలెక్షన్స్…
ఇక మూడు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మొత్తం మీద అంచనాలను మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టించాయి…ఆ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి..
👉Nizam: 53.50Cr
👉Ceeded: 28.90Cr
👉UA: 15.54Cr
👉East: 8.69Cr
👉West: 7.98Cr
👉Guntur: 11.56Cr
👉Krishna: 8.25Cr
👉Nellore: 4.82Cr
AP-TG Total:- 139.27CR(203.10CR~ Gross)
ఇవీ ఫస్ట్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాలలో ఆర్ ఆర్ ఆర్ సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్…
మూడో రోజు సినిమా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకుని ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది. ఫస్ట్ డే కి కూడా చాలా కొన్ని సినిమాలకు మాత్రమే సాధ్యం అయ్యే రేంజ్ గ్రాస్ ని మూడో రోజు అందుకోవడం విశేషం… ఇక అప్ కమింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా కచ్చితంగా మరిన్ని రికార్డులను సినిమా సృష్టించే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు ఓవరాల్ గా…